సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. లాభాల్లో 29 శాతం వాటాను బోనస్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది కన్నా ఇది ఒక శాతం అధికం. దసరా ముందుగానే కార్మికులందరికీ బోనస్ చెల్లించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ను ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు.సంస్థను అగ్రగామిగా నిలపడంలో కార్మికులు గొప్ప క్రుషి చేశారని కొనియాడారు. సీఎం నిర్ణయంతో 43 వేల కార్మికులు లబ్ధి చేకూరనుంది. సింగరేణి కార్యకలాపాలు మరింత విస్తరించాలని కోరారు. ఇసుక, ఇనుము, సున్నపురాయి పరిశ్రమల్లోకి విస్తరించాలని ఆకాంక్షించారు. బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిలో ఇప్పటికే దేశంలో అగ్రగామిగా ఉన్నామని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేయడం శోచనీయం అని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత కార్మికుల కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.