సింగరేణి కార్మికులకు కరోనా వస్తే 7 రోజులు సెలవులు మంజూరు చేస్తామని యాజమాన్యం వెల్లడించింది. కేంద్రం తాజాగా సడలించిన మార్గదర్శకాల ప్రకారం ఏడు రోజలు సెలవులు ఇస్తామంది. ఏడు రోజుల ఐసోలేషన్ తర్వాత విధుల్లోకి రావచ్చని తెలపింది. గతంలో సింగరేణి 14 రోజులు సెలవులు ఇచ్చేది. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన మార్గదర్శకాలతో సెలవును 7 రోజులకు కుదించింది.
సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 913 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 382 మంది ఉద్యోగులు, కార్మికులు కాగా.. 116 మంది జౌట్ సోర్సింగ్ సిబ్బంది, 415 మంది కుటుంబ సభ్యులు ఉన్నారని సింగరేణి యాజమాన్యం తెలిపింది. తెలంగాణలోని మంచిర్యాల, కుమ్రంభీం, భూపాలపల్లి, పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉంది. దాదపుగా సింగరేణిలో ప్రత్యక్షంగా 50 వేలకు పైగా మంది… పరోక్షంగా కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. కార్మికులకు కరోనా వస్తే పని ప్రదేశంలో మరింత మందికి వ్యాపించే అవకాశం ఉండటంతో సింగరేణి సంస్థ పలు రక్షణ చర్యలు తీసుకుంటుంది.