Breaking : మోగిన సింగరేణి ఎన్నికల నగారా

-

సింగరేణిలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించనున్నట్ల డిప్యూటీ సీఎల్సీ ప్రకటించారు. అక్టోబర్ 6,7 తేదీల్లో నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత నామినేషన్ల స్క్రూటిని, ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 28న పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ జరపనున్నారు. కాగా 2019లోనే గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ఏదో కారణంతో వాయిదా వేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం డిప్యూటీ సీఎల్‌సీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముంగిట్లో జరుగుతున్న సింగరేణి ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండంగా మారుతాయనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ఇది ఇలా ఉంటె, సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం కార్మికులకు బోనస్‌గా అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి‌ నుంచి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version