వైసీపీ బోరుకు వచ్చిన బండిలాంటిది.. గేరు మార్చినా నడవదు : కళా వెంకట్రావ్‌

-

ఇక గేరు మార్చి జోరుగా దూసుకుపోవాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు కర్తవ్యబోధ చేయడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు స్పందించారు. వైసీపీ బోరుకు వచ్చిన బండిలాంటిదని, బోరుకు వచ్చిన బండి గేరు మార్చినా నడవదు జగన్ రెడ్డీ! అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రజలంతా వైసీపీ అరాచక, దౌర్జన్య మోసపూరిత పాలన పట్ల ఉగ్రులై నిన్ను భరించలేం జగన్ రెడ్డీ అంటుంటే… సీఎం జగన్ రెడ్డి మాత్రం ఆంధ్రాకు మళ్లీ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటు అని కళా వెంకట్రావు మండిపడ్డారు.

ఎందుకు జగన్ ఆంధ్రాకి కావాలో ఆయనే చెప్పాలి అని డిమాండ్ చేశారు.‘2.13 లక్షల ఉద్యోగాలని ఇవ్వకుండా యువతను మోసం చేసినందుకా? అని విరుచుకుపడ్డారు. కమీషన్ల కోసం పరిశ్రమల్ని తరిమేసి యువతకు ఉపాధి లేకుండా చేసినందుకా? అని విరుచుకుపడ్డారు. మద్య నిషేదం చేస్తానని మాట తప్పి నాసిరకం మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నందుకా? సీపీఎస్ రద్దు చేయకుండా ఉద్యోగులను మోసం చేసినందుకా? ప్రత్యేక హోదాను కేసుల మాఫీకి తాకట్టు పెట్టి రాష్ట్రానికి ద్రోహం చేసినందుకా? రైతు భరోసా రూ. 12500 ఇస్తా అని చెప్పి రూ. 7500 ఇచ్చి మోసం చేసినందుకా? ఎందుకు మరో అవకాశం ఇవ్వాలి’ అని కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ‘వ్యవసాయానికి సాయం అందిందచకుండా అన్నదాతల ఉసురు తీస్తున్నందుకా? మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా… పట్టించుకోనందుకా? టీడీపీ హయాంలో శరవేగంతో పోలవరం ప్రాజెక్టును అయిదేళ్లలో 72% పూర్తి చేస్తే జగన్‌ పాలనలో నాలుగున్నరేళ్లలో 4% పనులు కూడా పూర్తి చేయకుండా రైతులను నట్టేట ముంచిన రైతుద్రోహి జగన్‌రెడ్డి. ఎందుకు మళ్లీ ఆంధ్రాకి జగనే కావాలో వైసీపీ సీఎం జగన్ , నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని నలభై ఏళ్లు వెనక్కి నెట్టి… సిగ్గులేకుండా మళ్లీ జగనే కావాలి అంటూ ప్రచారం చేస్తారా?’ అని కిమిడి కళా వెంకట్రావు మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version