జనంలో మార్పు వస్తే మినహా కరోనా వైరస్ కట్టడి అయ్యే అవకాశం ఉండదు. జనం అర్ధం చేసుకుని ప్రభుత్వాలకు సహకరిస్తే మినహా లాభం లేదు. అయితే కొందరు మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఆందోళన కలిగించే అంశ౦. బయటకు అందరూ కలిసి రావోద్దన్నా, సామాజిక దూరం పాటించాలి అని సూచిస్తున్నా సారే ఎవరు కూడా జనాలు తమకు చేస్తున్న సూచనలను, హెచ్చరికలను పెడ చెవిన పెడుతున్నారు.
తాజాగా ఒకే బైక్ పై ఆరుగురు వెళ్ళడం వివాదాస్పదంగా మారింది. కర్నూలు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆరుగురు ఒకే బైక్‌పై తిరుగుతున్నారు. ఈ బైక్ ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. భౌతిక దూరం పాటించాలని, ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు, ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయినా సరే ఎవరూ కూడా వినడం లేదు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె చెక్‌పోస్టు వద్ద పోలీసులు గుర్తించారు.
గురువారం పోలీసులు తనిఖీలు ఇస్తున్న సమయంలో ఏ మాత్రం భయం లేకుండా ఒక వ్యక్తి బైక్ పై ఇలాగే వచ్చాడు. వారి లెక్క లేని తనాన్ని చూసి మాబు అనే కానిస్టేబుల్ వెంటనే అడ్డుకుని వాళ్లకు ఎం చెప్పాలో అర్ధం కాక దండం పెట్టాడు. బైక్‌పై ఒక్కరే వెళ్లాలని, కరోనా వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించి పంపించారు.