‘అల్మిదా’ పది పాసైన మహిళ… వేల వైరస్‌లు గుర్తించింది…!

-

వైరస్ లను కనిపెట్టడం, వాటిని గుర్తించడం, వాటి ఆకారాలను చెప్పడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. ప్రపంచం ఎన్నో రకాల వైరస్ లతో ఇబ్బంది పడింది. గుర్తించడానికి ఎన్నో పరిశోధనలు చేసారు. అయితే వైరస్ లను గుర్తించడం లో మాత్రం ఒక మహిళ కీలకంగా వ్యవహరించారట. ఆమె పేరు జాన్ అల్మిదా… ఆమె వలనే నేడు ప్రపంచ వ్యాప్తంగా వైరస్ లను శాస్త్రవేత్తలు అత్యంత సులువుగా గుర్తిస్తున్నారని అంటున్నారు.

స్కాట్ లాండ్ లో పుట్టిన ఆ మహిళ పదో తరగతి వరకు మాత్రమే చదివింది. ఆ తర్వాత ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా… లేబొరేటరి టెక్నీషియన్ గా జాయిన్ అయింది. 1964 లో లండన్ లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో ఆమె సేవలు అందించింది. ఆమెకు వైరస్ లను గుర్తించడం అంటే చాలా ఇష్టం. మైక్రోస్కోపీపై యెనలేని పట్టు సాధించింది. డేవిడ్‌ టిర్రెల్‌ అనే డాక్టర్‌తో కలిసి సాధారణ జలుబుకు కారణాలపై ఆమె పరిశోధన చేసింది.

టెర్రెల్‌ ఓ చిన్నారి ముక్కు నుంచి తీసిన నమూనాలో బీ814 అనే వైరస్‌ను గుర్తించారు. అది మైక్రో స్కోప్ లో చూసినప్పుడు సాధారణ వైరస్ గా గుర్తించినా… కాని భిన్నంగా ఉందని అల్మిదా గుర్తించింది. లోతుగా దాన్ని గుర్తిస్తే దానికి కొమ్ములు కిరీటం ఉందని వెల్లడి అయింది. ఇది కొత్తగా ఉందని గుర్తించిన వైద్యులు… దాని విషయంలో అప్పటి నుంచే జాగ్రత్తగా ఉన్నారు. వారిద్దరూ కలిసి దానికి రోనా అనే పేరు పెట్టారు.

అయితే వాటిని మెడికల్ జర్నల్స్ కి పంపగా అది కొత్త వైరస్ కాదని… ఇన్‌ఫ్లూఎంజా వైరస్‌లోని ఒక భాగ౦ అని పేర్కొన్నారు. ఫోటో తీయడం రాలేదని ఎద్దేవా చేసారు. 1965లో బీ814 వైరస్‌పై జర్నల్స్‌లో కథనం వచ్చింది. రెండేళ్లు అల్మీదా తీసిన చిత్రాన్ని వైరాలజీకి సంబంధించిన జర్నల్స్‌లో ఉంచారు. అప్పుడే కరోనా రూపం గురించి తొలిసారి వైద్య శాస్త్రానికి తెలిసింది. ఆ తర్వాత మాత్రం దాని ఉనికి లేదు.

కెనడాలోని ఒంటారియా కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నప్పుడు అల్మిదా… కంటికి కనిపించని వైరస్‌లను మైక్రోస్కోపీలో సులభంగా చూడగలిగే విధంగా ‘ఇమ్యూన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీ’ పద్ధతిని అభివృద్ధి చేసారు. ఈ పద్దతిలో వైరస్‌లను మనిషి లేదా జంతువు యాంటీబాడీలతో కలిపివేస్తే అప్పుడు వైరస్ లు మైక్రోస్కోప్ లో బాగా గుర్తించడానికి వీలు ఉంటుంది. ఆ విధంగానే ఆమె ప్రపంచానికి ఎన్నో రకాల వైరస్ లను చూపించింది.

ఆమె ఆ నాడు చేసిన కృషి తోనే… మన ప్రపంచంలో ఎన్నో రకాల వైరస్ లను వైద్యులు సులువుగా గుర్తిస్తున్నారు. ఆమె ఎన్నో పుస్తకాలకు రచయితగా పని చేయడమే కాకుండా… వైద్య శాస్త్రాన్ని అవపోసన పట్టిన వాళ్ళు కూడా చెప్పలేని విషయాలని చెప్పారు ఆమె. ఆమె రాసిన పుస్తకాలకు గౌరవంగా 1970లో డాక్టరేట్‌ ఇచ్చారు. కొంతకాలం మైక్రోస్కోపీలో అధ్యాపకురాలిగా సేవలు అందించారు. 77 ఏళ్ళ వయసు ఉన్న సమయంలో ఆమె గుండెపోటు తో మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version