ఎమ్మెల్యే అల్లుడి కారు బీభత్సం- ఆరుగురు బలి

-

అతి వేగం ఆరుగురిని బలిగొంది. గుజరాత్ ఆనంద్ జిల్లా సోజిత్రా గ్రామం దగ్గరలో గురువారం సాయంత్రం జరిగిందీ ఘటన. ఆనంద్​, తారాపుర్​ను కలిపే రాష్ట్ర రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ ఎస్​యూవీ.. ఆటోను, బైక్​ను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న నలుగురు, బైక్​పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. చికిత్స కోసమని ఓ ఆస్పత్రిలో చేరాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులంతా సోజిత్రా, బొరియావీ గ్రామాల ప్రజలని నిర్ధరించారు. గుజరాత్​లో ఓ కాంగ్రెస్​ ఎమ్మెల్యే అల్లుడైన కేతన్​ పదియార్​.. ఎస్​యూవీని వేగంగా నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యాడని ప్రాథమికంగా తేల్చారు. కాసేపటికే కేతన్​ను అరెస్టు చేశారు. ఆరుగురు మరణానికి కారణమయ్యాడని ఐపీసీ సెక్షన్​ 304 కింద కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అల్లుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version