ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం చోటుచేసుకుని ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయాయి. అందులో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు సైతం కొనసాగుతున్నాయి. టెన్నెల్ 13.5 కిలోమీటర్ల వద్ద ప్రమాదం జరగ్గా.. అక్కడ నీరు, భారీగా బురద పేరుకుపోయినట్లు రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి.
అందుకే ముందుకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టడం సాధ్యం కావడం లేదని అందులోకి వెళ్లిన రెస్క్యూ టీమ్ వారు చెబుతున్నారు. అయితే, సోమవారం టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్స్‌ను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో టంగ్ స్లిప్ అయ్యారు. వాటర్, నీళ్లు కలిసే సరికి ప్రమాదం జరిగిందని చెప్పారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై తీన్మార్ మల్లన్న స్పందిస్తూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి SLBC టన్నెల్ వద్ద కామెడీ చేసి పరువు తీస్తున్నారు..ఆయన గురించి తెలిసికూడా ఆయన్ని ముఖ్యమంత్రి ఎందుకు SLBC దగ్గరకు పంపించారు? అని సొంత పార్టీ నేత విమర్శించడం గమనార్హం.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి SLBC టన్నెల్ వద్ద కామెడీ చేసి పరువు తీస్తున్నారు.. ఆయన గురించి తెలిసికూడా ఆయన్ని ముఖ్యమంత్రి ఎందుకు SLBC దగ్గరకు పంపించారు?🤣: కాంగ్రెస్ ఎమ్మెల్సీ pic.twitter.com/yUx23NmKPc
— Gowtham Pothagoni (@Gowtham_Goud6) February 25, 2025