ఎస్ఎల్‌బీసీ టన్నెల్ బాగోతం గురించి 2018లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ ప్రాజెక్టు అంత ఆశామాషీ కాదని, అందులో పెద్ద మిషిన్ అమర్చారని..అది తవ్వు కుంటూ ముందుకు వెళ్లాలి తప్పా వెనక్కి రావడం కష్టమని పేర్కొన్నారు.
రెండు కొండల మధ్యల నుంచి ఎస్ఎల్‌బీసీ సొరంగం తవ్వుతున్నారని.. అసలు ఆ ప్రాజెక్టు ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కావడం లేదని కేసీఆర్ అన్నారు. ఈ టన్నెల్ ప్రపంచంలోనే అతిపొడవైనదని, సుమారు 42 కిమీ ఉంటుందని పేర్కొన్నారు. ఇది ఘోరమైన కుట్రగా అభివర్ణించారు.మొన్నటివరకు ఈప్రాజెక్టు ఆగిపోగా.. ఆగమేఘాల మీద మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మూడు రోజులకే SLBC టన్నెల్ కుప్పకూలినట్లు తెలిసింది. దీంతో కేసీఆర్ మాట్లాడిన పాత వీడియోను బీఆర్ఎస్ ఫాలోవర్స్ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/Nallabalu1/status/1893527892187062560