SLBC టన్నెల్ ప్రమాద ఘటన కీలక అప్డేట్ వచ్చింది. సహాయక చర్యల కోసం లోనికి వెళ్లిన NDRF బృందాలు 4 గంటల తరువాత టన్నెల్ నుంచి తిరిగి వచ్చారు. 12 కిలోమీటర్లు అండర్ టన్నెల్ ట్రైన్‌లో ప్రయాణించి వారు, అక్కడి నుండి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ ముందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు.
అయితే, టన్నెల్ కూలడంతో మోకాలు లోతు వరకు నీరు నిండుకుందని,దాంతో ముందుకు వెళ్లలేకపోయామని NDRF బృందం తెలిపింది.మొత్తం ఆరు మీటర్ల మీద బురదతో నిండిపోయిందని అధికారులు చెబుతున్నారు.ఫ్లై కెమెరాతో లోపల దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సాంకేతిక మిషనరీ సాయంతో లోపలికి వెళ్లాలని NDRF స్పష్టంచేసింది.ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లే అవకాశం ఉందని వివరించింది.