విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పించగలిగే హీరోలలో అడవి శేషు ముందుంటారు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రతి సారి కూడా ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సమాజానికి మంచి మెసేజ్ ను అందిస్తూ ఉంటాడు. ఇకపోతే తాజాగా ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు అడవి శేష్.. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన విషయాలను మాట్లాడుతూ.. ఒకరి వల్ల చాలా ప్రశాంతంగా నిద్ర పోతున్నాను అంటూ తెలిపారు. ఎవరు అతడు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం.
ఇక వాస్తవానికి భవిష్యత్తులో అకీరానందన్ మంచి సినిమా హీరో అవుతాడో లేదో తెలియదు కానీ మంచి మ్యూజిషియన్ అవుతాడు అని చెప్పడంలో సందేహం లేదు అంటూ తెలిపాడు. ఇక అకీరానందన్ కు మ్యూజిక్ పట్ల విపరీతమైన అభిరుచి ఉంది అని తరచూ తాను కంపోజ్ చేసే పియానో మ్యూజిక్ బిట్స్ ని ప్రతిరోజూ తనకు పంపిస్తూ ఉంటాడు అని తెలిపాడు. ఇక అకీరానందన్ పంపించే మ్యూజిక్ బిట్స్ వింటూ రాత్రులు చాలా ప్రశాంతంగా నిద్ర పోతాను అని అకీరానందన్ వల్లే ఇది సాధ్యమైంది అని తెలిపాడు.