ముఖకవళికలతోనే మెప్పిస్తున్న సాయిపల్లవి..‘నగాదారిలో’ ఫుల్ సాంగ్ వచ్చేసింది..

-

డైరెక్టర్ వేణు ఉడుగుల..తీసింది ఒకే ఒక్క సినిమా అయినా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం ‘విరాట పర్వం’..టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఈ చిత్ర విడుదల తేదీని ఇటీవల ప్రీ పోన్ చేశారు మేకర్స్. ఈ నెల 17న సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలోనే చిత్రంలోని ‘‘నగాదారిలో’’ అనే సాంగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. పాటను వరంగల్ కు చెందిన వరం ఆలపించగా, సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. లిరిక్స్ ను దేవేరి నరేందర్, భరద్వాజ్ కలిసి అందించారు. రానా, సాయిపల్లవి జంటగా నటించగా, నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు.

ఇక పాట కు తగ్గట్లు మెలోడీ మ్యూజిక్ ఇచ్చారు సంగీత దర్శకులు. ‘నిప్పూ ఉంది..నీరూ ఉంది ‘నగాదారిలో’ అంటూ సాగే పాట వీడియోలో అడవిలో ఉన్న నక్సలైట్ కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవి నటించారు. పాటకు తగ్గట్లు సందర్భోచితంగా ముఖకవళికలతోనే భావాన్ని పలికిస్తోంది సాయిపల్లవి. రానా సైతం మ్యాన్లీగా కనిపిస్తున్నారు. నక్సల్ గెటప్ లో రానా చాలా చక్కగా కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version