బోరబండలో వచ్చింది భూకంపమే.. కానీ స్వల్పంగా !

-

భూకంపం భయంతో బోరబండ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఇది భూకంపం కాదని పోలీసులు చెబుతున్నా సైట్ 3 లో భూకంపం వచ్చినట్టు గుర్తించారు శాస్త్రవేత్తలు, 1.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు గుర్తించామని రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ప్రకంపనల వచ్చాయని చెబుతున్నారు. అలానే తిరిగి రాత్రి 11:24 భారీ శబ్దాలతో భూప్రకంపనలు వచ్చాయని అంటున్నారు.

2017 లోనూ బోరబండ లో భూకంపం వచ్చిందని, అయినా సరే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో చీలికల వల్ల ఇలాంటి ప్రకంపనలు తరచూ వస్తుంటాయని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ పేర్కొన్నారు. నిన్న రాత్రి నుంచి వరుస భూప్రకంపనల తో బోరబండ వాసుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయంతో రాత్రి నుంచి రోడ్డు మీదనే జాగారం చేస్తున్నారు బోరబండ వాసులు. నేడు బోరబండలోని సైట్-3, అల్లాపూర్, వీకర్స్ కాలనీ లో NGRI శాస్త్రవేత్తల బృందం పర్యటించనున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version