ఉత్తరం ఊపుమీదుందే.. దక్షిణం దంచికొడుతుందే.. తూరుపు తుక్కురేపిందే.. పడమరా పక్కవేసి పైకి పైకి పైకి రమ్మందే.. విశాఖ వాస్తు బాగుందే.. ఓ బాబు వాస్తు బాగుందే… అంటూ పాటలు పాడుకునే పరిస్థితి జగన్ ది! ఈ పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో వైకాపా ఊపును ఆపాలంటే అచ్చెన్న ఒక్కడే దిక్కని నమ్ముతున్నారు బాబు & కో! మరి జగన్ సాంగ్ ఎందుకు.. అచ్చెన్న దిక్కు ఎలా? ఇప్పుడు చూద్దాం!
ఏ ప్రాంతంలో అయితే పరిపాలనా రాజధాని వద్దని చంద్రబాబు తోకడ్డుపెడుతున్నారో… సరిగ్గా అక్కడ బాబుకు రాజకీయంగా ఏ కాస్త బలం లేకుండా దంచికొడుతున్నారు జగన్. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైకిల్ దిగేశారు.. బై బై బాబు అనేశారు! ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు.. ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్నారు! పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కూడా కాస్త అటు ఇటుగా ఊగుతున్నారు! దీంతో పరిపాలనా రాజధాని ప్రాంతంలో టీడీపీని ఎవరూ కాపాడలేరనే చెప్పాలి!
దీంతో… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడు ఒక్కడే మగాడని ఆల్ మోస్ట్ బాబు & చినబాబు ఒప్పేసుకున్నారు! ఇందులో భాగంగా… ఆదివారం అచ్చెన్నకు టీడీపీ ఏపీ బాధ్యతలు పూర్తిగా అప్పగిస్తారని అంటున్నారు! అలా అని కళా వెంకట్రావుని ఆడించినట్లు నామాత్రపు అధ్యక్షుడిగా ఉంచితే కాదు… ఫుల్ పవర్స్ కావాలని అంటున్నారంట అచ్చెన్న!
ఒప్పుకున్న పెళ్లికి వాయించకతప్పదు అన్నట్లుగా… అచ్చెన్న పెట్టిన ప్రతి కండిషన్ కి బాబు & చినబాబు జోడీగా తలలూపుతున్నారంట! మరి ఈ విషయంలో తాను తీసుకున్న బాధ్యతో, పార్టీ బలవంతంగా రుద్దిన భారమో.. ఏదైనా కానీ, అచ్చెన్న ఉత్తరాంధ్రలో టీడీపీని పాలముంచుతారో, నీట ముంచుతారో వేచి చూడాలి!! ఏదిఏమైనా… ఏందులోకందులో అయితే ముంచగల సమర్ధుడు అచ్చెన్న అనేది ఆయన అభిమానుల మాటగా ఉంది!!
-CH Raja