దేశంలో జనాభా పెరిగికొద్దీ ఇళ్ల సైజు తగ్గిపోతూ వస్తోంది. ఒకప్పుడు విశాలంగా ఉండే ఇల్లు ఉండేవి. పైగా దానికి వాకిలి, పెరడు, కొంత ఖాళీ స్థలం ఉండేవి. కానీ మెల్ల మెల్లగా అవి కనుమరుగైపోయాయి. అయితే విశాలమైన ఇళ్ళు ఇప్పటికీ పల్లెటూర్లలో ఉన్న సిటీల్లో మాత్రం కనపడటం గగనం. చిన్న ఖాళీ స్థలంలోనే అంతస్తుల మీద అంతస్తులు కట్టేస్తున్నారు. అయితే ఎంత అంతస్తులు కట్టిన కనీసం మనిషి నివసించడానికి 40 నుంచి 50 గజాల స్థలం అయిన కావాల్సి వస్తుంది.
కానీ ఢిల్లీలో ఒకతను మాత్రం కేవలం 6 గజాల్లోనే మూడంతస్తుల భవనం నిర్మించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. పెరుగుతున్న జనాభా.. దానికి తగ్గట్టుగా ఆకాశాన్ని అందుకుంటున్న స్థలాల రేట్లతో విసిగిపోయిన ఈయన.. తనకున్న ఆరు గజాల స్థలంలోనే ఆరేళ్ళ క్రిందట ఏకంగా మూడు అంతస్థుల అందమైన భవనాన్ని తక్కువ ఖర్చుతో నిర్మించేశాడు.
ఇక ఈ భవనంలో కుటుంబాలు నివసించే విధంగా వసతులు ఉన్నాయి. కిచెన్, హాలు, బాత్ రూం, బెడ్ రూం ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా 4 కుటుంబాలు కూడా అందులో నివాసం ఉంటున్నాయి. కాకపోతే కొంచెం సర్దుకుంటే అన్నీ సరిపోతాయట. ఇక ఈఈ బిల్డింగుల్లోని గదులకు నెలకు రూ.3,500 అద్దె కూడా కడుతున్నారు. కేవలం ఆరు గజాల్లో నిర్మితమైన ఈ ఇళ్ళు ధర ప్రస్తుతం రూ. 14 లక్షల వరకు పలుకుతుందట.
ఢిల్లీలోని బురాడీలో నిర్మితమైన ఈ వింత ఇల్లుని చూసేందుకు చుట్టపక్కల జనం ఎగబడుతున్నారట. మొత్తానికి ఆ పెద్ద మైన్షీ ఎవరో మనసు ఉంటే మార్గం ఉంటుందనే సూత్రాన్ని బాగా ఫాలో అయినట్లున్నాడు.