ఆధార్‌తో ఐటీ రిటర్న్ దాఖలు చేసినవారికి శుభవార్త!

-

ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినవారికి కేంద్రం శుభవార్తను ప్రకటించింది. ఇది ఎవరికో తెలుసుకుందాం… పాన్ లేకుండా కేవలం ఆధార్ ద్వారా ఐటీ రిటరన్స్ దాఖలు చేసినవారికి ఆదాయపన్ను శాఖ ఆటోమేటిక్‌గా పాన్ కార్డును జారీ చేయనుంది. ఈ మేరకు సీబీడీటీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. సీబీడీటీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వ్యక్తిగతంగా ఆధార్ నెంబరు ద్వారా ఐటీ రిటరన్స్ ఫైల్ చేసిన వారికి ఆటోమేటిక్‌గా పాన్ కార్డును ఇవ్వనుంది.

Good News For Aadhar Link to It Returns

బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్ కార్డును ఉపయోగించడం అంటే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసినట్లుగా పరిగణిస్తున్నట్టు సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని, త్వరలోనే పాన్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని సీబీడీ ఛైర్మన్ పీసీ మోడీ తెలిపారు.

ఆధార్ కార్డులో వినియోగదారుడి పేరు, పుట్టిన తేదీ, జండర్, ఫోటో, అడ్రస్, తదితర వ్యక్తిగత వివరాలను యూఐడీఏఐ ద్వారా ఆదాయ పన్ను శాఖ సేకరించి దాని ఆధారంగా 10 అంకెల పాన్ కార్డును జారీ చేస్తామన్నారు. పాన్ కార్డులేని పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను రిటరన్స్ దాఖలు చేసేందుకు ఆధార్ కార్డును ఉపయోగించు కోవచ్చునని కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version