పొగలు కక్కిన చేప.. ఈల్‌ను మింగి ఏం చేసిందంటే..!

-

చేపలు చాలా శాంత జీవులని భావిస్తుంటారు. నీటిలో పెరిగే నాచు పదార్థాలు తిని బతికేస్తుంటాయని అనుకుంటారు. కానీ, పెద్ద చేపలు.. చిన్న చేపలను మింగేస్తుంటాయి. షార్క్, సొర వంటి చేపలైతే ఏకంగా తమ దంతాలతో కొరికి నమిలేస్తుంటాయి. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక చిన్న చేప తనకంటే పెద్దదైన ఈల్ చేపను మింగేందుకు ప్రయత్నించింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కి గురవుతున్నారు. అసలు ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం రండి.

fish-eel

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్ ఖాతాలో రెండు వీడియోలను షేర్ చేశాడు. బురద మడుగులో ఉన్న ఓ చేప ఆమాంతం పైకి తేలి నోట్లో నుంచి పొగలు కక్కుతుంది. అది చూసినప్పుడు నీటిలోఉంటే చేప నోటిలో నుంచి పొగలు ఎలా వస్తాయనేది ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం. అలా పొగలు కక్కిన చేప మెల్లిగా బురదలో దాక్కుంటుంది. కాసేపటి తర్వాత బురద పక్కనున్న బొరియలో నుంచి పెద్ద ఈల్ చేప బయటకు వస్తుంది.

ఈల్ నీటిలో వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ బురదలో ఉన్న చేప దాన్ని మింగేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడు ఈల్ తప్పించుకుని మళ్లీ బొరియలో దాక్కుంటుంది. కొద్ది సేపటి తర్వాత ఈల్ చేప మళ్లీ బయటకు వస్తుంది. నీటిలో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు అమాంతం బురదలో ఉన్న చేప నోట్లో వేసుకుంటుంది. ఈల్‌ను మొత్తంగా మింగేస్తుంది. సైజుకు మించి పెద్దదిగా ఉండటంతో చేప దాన్ని బయటకు తీసేస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతిఒక్కరూ నోళ్లు వెల్లబెట్లుకోవాల్సిందే. వీడియో చూస్తున్నంత సేపు ఉత్కంఠ నెలకొని ఉంటుందనే మీరు నమ్మలేరు.

ఈ తతంగాన్ని సుశాంత్ నంద రెండు వీడియోలో చిత్రీకరించి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చేప ఎలా పొగలు బయటకు తీసింది. ఈల్‌ చేపలోకి వెళ్లి ఏమైనా చేసిందా.. అసలు ఏం జరిగి ఉంటుందంటూ ప్రశ్నించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version