రాహుల్‌ గాంధీకి స్మృతి ఇరానీ సవాల్

-

రాహుల్‌ గాంధీ కి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాలు విసిరారు. యూపీలోని అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని స్మృతి ఇరానీ సవాలు చేశారు.తన నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జరిగిన ‘జన్ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొన్నా ఆమె మాట్లాడుతూ…..రాహుల్‌కి అమేథీలో ఎంత ప్రజాదారణ ఉందో భారత్ జోడో యాత్ర చూస్తే స్పష్టము అవుతుందని అన్నారు. కనీసం స్వాగతం పలికేందుకు కూడా కార్యకర్తలు రాలేదని ,అమేథీ వీధులన్నీ ఖాళీగా కనిపించాయని అన్నారు. వ్యాఖ్యానించారు. అమేథీ ప్రజలు ఎప్పుడో రాహుల్‌ను మరిచిపోయారని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.

అమేథీ కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉన్నప్పటికీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఉత్తర ప్రదేశ్ లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే రాయబరేలి నుంచి గెలిచారు. అయితే రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version