భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఆస్ట్రేలియాలో జరగనున్న బిగ్‌బాష్ లీగ్‌కు దూరంగా ఉండాలని భావిస్తోంది. 2022 ఫిబ్రవరి నుంచి విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడుతోంది. ఫిబ్రవరిలో ఇండియా-న్యూజిలాండ్ ద్వైపాక్షిక టోర్నమెంట్లో, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్‌లో ఆడింది. అనంతరం కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పాల్గొంది. మళ్లీ ఇప్పుడు ఇంగ్లాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది.
బిగ్‌బాష్ లీగ్ అక్టోబర్ 13న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ నవంబర్ చివరి వరకు సాగుతుంది. అయితే.. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 టోర్నమెంట్ బిగ్‌బాష్ లీగ్ నుంచి ఆమె తప్పుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా స్మృతి మంధాన వెల్లడించింది. “మానసికంగా కాకున్నా.. ఫిజికల్‌గా ఒత్తిడి లేకుండా మేనేజ్ చేసుకోవడం కూడా ముఖ్యమే. బిగ్‌బాష్ లీగ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను భారత జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లు మిస్ కాదలచుకోలేదు. నేను భారత జట్టు తరఫున ఆడినపుడు.. నా నుంచి 100 శాతం ప్రదర్శన ఇవ్వాలనుకుంటాను” అని చెప్పుకొచ్చింది.