కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలోకి పాము ప్రవేశించడం కలకలం రేపుతోంది. హోం గార్డు గది సమీపంలో 5 అడుగుల పాము కనిపించింది. అయితే. పామును చూసి సిబ్బంది భయంతో అటు ఇటూ పరుగులు తీశారు. జనాల గందరగోళంతో పాము అక్కడే ఉన్న చెక్క పలకల మధ్య దాక్కుని ఉంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అటవీ అధికారులు, స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. గంటల తరబడి శ్రమించి పామును ఎట్టకేలకు బయటకు తీశారు. అయితే.. ఈ పాము 5 అడుగుల పొడవు ఉంది. ఆసియాటిక్ వాటర్ స్నేక్ అని పిలువబడే 5 అడుగుల పొడవైన చెకర్డ్ కీల్‌బ్యాక్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో కనిపించింది. ఇది భద్రతా అధికారులను గందరగోళానికి గురి చేసింది.
అధికారులు వైల్డ్‌లైఫ్ ఎస్ వోఎస్ ను అప్రమత్తం చేయడంతో చివరికి దాన్ని సురక్షితంగా బంధించి సమీప అడవుల్లో విడిచిపెట్టారు. ఇది విషం లేని పాముగా గుర్తించారు. చెకర్డ్ కీల్‌బ్యాక్ ప్రధానంగా సరస్సులు, నదులు, చెరువులు, కాలువలు, వ్యవసాయ భూములు, బావుల వంటి నీటి వనరులలో ఎక్కువగా కనిపిస్తుంది. 1972 వన్యప్రాణి (రక్షణ) చట్టం షెడ్యూల్ II ప్రకారం ఈ జాతి పాములను రక్షిస్తుంది. ఇకపోతే, ఢిల్లీలో వర్షాకాలంలో ఇళ్లలోకి దూరిన దాదాపు 70 పాములను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. వర్షాలు, వరదల కారణంగానే పాములు తరచూ ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయని చెబుతున్నారు.