Breaking : విశాఖ నోవాటెల్‌ దగ్గర ఉద్రిక్తత

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ నోవాటెల్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశాఖ పోలీసులు పవన్ ఇచ్చిన గడువు సమయం ముగిసింది. సాయంత్ర 4.30 లోపు విశాఖను వీడి హైదరాబాద్ వెళ్లిపోవాలి అంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముందు అనుకున్న విధంగా జనవాని కార్యక్రమం ఏర్పాటు చేసిన పోర్టు కళావాణి దగ్గరకు చేరుకున్న ఆయన.. పోలీసుల తీరుకు నిరసగా.. జనవానిని రద్దు చేశారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పోలీసులు పవన్ కు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు.. విశాఖలో ర్యాలీలకు, సమావేశాలకు అనుమతి లేదని.. అలాంటి నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని.. ముఖ్యంగా పవన్ చూసేందుకు బారీగా అభిమానులు వస్తుండడంతో ఇబ్బంది కలుగుతోందని పోలీసులు ఆయనకు చెప్పారు.

పోలీసుల ఆంక్షల నేపథ్యంలో సాయంత్రం 4.30 గంటలలోపు విశాఖను వీడి వెళ్లాలని.. పవన్ తో సహా జనసేన నేతలంతా హైదరాబాద్ వెళ్లిపోవాలి అంటూ ఆ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఆ నోటీసులను చదవి వినిపించిన పవన్ కళ్యాణ్.. ప్రజల సమస్యలు వినడానికి వచ్చిన వారిని వెళ్లిపోమనడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై గౌరవంతో మౌనంగా ఉంటున్నామని.. తాను ప్రజా సమస్యలు వినడానికి వచ్చేనని.. అందుకే విశాఖ వీడి వెళ్లేది లేదని తేల్చి చెప్పేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version