అంగట్లో అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని ఉంటే అంతే.. అనే సామెత అందరు వినే ఉంటారు..మనకు అన్నీ ఉన్నాయి అని విర్రవీగితే మాత్రం ఎక్కడో చోట దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఇప్పుడు రష్యా పరిస్థితి కూడా అలా మారింది..ఉక్రెయిన్ ను తక్కువ అంచనా వేసింది.యుద్దానికి కాలు దువ్వింది చివరికి వరుస షాక్ లతో చతికిలపడింది.అన్నింటి కంటే పెద్ద షాక్ ఏమంటే ఆ ద్వీపమే. మొత్తం కలిపి 0.17 కిలోమీటర్లు ఉంటుంది, అంతే. స్కేల్ పెట్టి కొల్చేంత వీలున్న అతిచిన్న ద్వీపమది.
ఆ ద్వీపం పేరే స్నేక్ ఐలాండ్. ఇప్పుడు అదే అతి చిన్న ద్వీపం రష్యాకు కునుకు లేకుండా చేస్తోంది. వేల ఏళ్ల చరిత్ర వున్న ఆ చిన్న దీవి..ఇప్పుడు రష్యాకు పక్కలో బల్లెంలా మారింది.ఎందుకు దానికి జోలికి పోయి అనవసరంగా యుద్ధం చేశాము అని తలలు పట్టుకుంటున్నారు ఫుతిన్ సైన్యం..మొత్తం కొలిచినా పావు కిలో మీటర్ కూడా లేని స్నేక్ ఐలాండ్ అనేది అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రదేశం. సముద్ర మట్టానికి కేవలం 135 అడుగుల ఎత్తులో వున్నా దాని ప్రత్యేకత మరే ద్వీపానికి లేదు. అలాంటి దానిమీద కన్నేస్తే యుక్రెయిన్ ని భారీగా దెబ్బతీయొచ్చని కలలు గన్న రష్యా ప్లాన్ బెడిసి కొట్టింది. ఈ క్రమంలో మాస్కోవా యుద్ధ నౌక, ఆ ద్వీపంపై క్రూజ్ క్షిపణుల వర్షం కురిపించి, అక్కడి కట్టడాలను, లైట్‌హౌస్‌ను కూల్చి వేసింది..
ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి కేవలం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.ఆ దీవి రష్యాకు మృత్యు దీవిగా మారిపోయింది. తాజా లెక్కల ప్రకారం రష్యాకు చెందిన 2 భారీ యుద్ధ నౌకలతో సహా 3 నౌకలు ఈ బ్లాక్ సీలో మునిగిపోయాయి. చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రష్యాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా యుక్రెయిన్ క్షిపణులు రష్యాకే చెందిన మరో యుద్ధ నౌకను ధ్వంసం చేశాయి.. ఆ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలని రష్యా ప్రయత్నాలు అన్నీ వేస్టు అయ్యాయి. మొత్తానికి ఆ ద్వీపం భారీ నష్టం తో పాటు రష్యన్ లకు నిద్ర లేకుండా చేసింది..అత్యాశ దుఃఖానికి చేటు అని పెద్దలు ఊరికే అనలేదు..