హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని దట్టమైన మంచు కమ్మేసింది. అక్కడ ప్రస్తుతం విపరీతంగా మంచు కురుస్తోంది. ఎడతెరపి లేకుండా మంచు వర్షం పడుతుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు భయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రోడ్లన్నీ మంచులో కూరుకుపోయాయి.
ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్‌కు ఆ రాష్ట్ర వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తీవ్ర హిమపాతం ఉంటుందని హెచ్చరికలు చేసింది.పశ్చిమ గాలుల కారణంగా హిమాలయ రాష్ట్రాల్లో వర్షాలు, హిమపాతం ఉంటాయన్న ఐఎండీ వెల్లడించింది. ఇదిలాఉండగా, హిమాచల్ ప్రదేశ్‌కు టూరిస్టులు క్యూ కడుతున్నారు. మంచు కురుస్తున్న ఫీలింగ్‌ను ఎంజాయ్ చేసేందుకు ఆ రాష్ట్రానికి వెళ్తున్నట్లు సమాచారం.