అలా జబర్దస్త్ కమెడియన్ లతో అవమానపడ్డా : జోష్ రవి

-

జోష్ రవి .. తెలుగు సినీ ఇండస్ట్రీలో జోష్ సినిమా ద్వారా కమెడియన్ గా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన తన నటన తో ప్రేక్షకులను బాగా అలరించడం తో ఈయన పేరు ముందు ఆ సినిమా పేరును కూడా జోడించారు. నిజానికి ఈ సినిమా కంటే ముందు రెండు, మూడు చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న జోష్ రవి ఇక సినిమాలలో నటిస్తూనే .. అంతకుమందు జబర్దస్త్ ప్రేక్షకులను కూడా తనదైన శైలిలో సందడి చేశారు. ఇకపోతే ప్రస్తుతం జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఈయన సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లు కూడా వెల్లడించారు.

ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు అని.. అయితే తనకు బాగా పరిచయం ఉన్న దర్శకులు, నిర్మాతలు కారణంగా అవకాశాలు వస్తున్నాయని కూడా తెలియజేశారు. ఇదిలా ఉండగా బయట జబర్దస్త్ కమెడియన్లు కనిపించారంటే చాలా పెద్ద ఎత్తున ఫోటోల కోసం ఎగబడతారు జనాలు అని కూడా వెల్లడించారు. మరికొన్ని విషయాలను ఆయన తెలియజేస్తూ జబర్దస్త్ వాళ్ళతో ఫోటోల కోసం వెళితే వాళ్లు పెద్ద హీరోలమని బిల్డప్ ఇస్తారు . అయితే ఆ క్షణం వరకు మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఆ తర్వాత తిరిగి మనం ఏంటో తెలుసు కాబట్టి ఆ ఊహ నుంచి బయటకు రావాలని ఆయన వెల్లడించారు.ఇకపోతే ఒకానొక సమయంలో జబర్దస్త్ వాళ్ళతో ఫోటో దిగడానికి వెళితే వాళ్లు హీరోగా బిల్డప్ కొట్టి నాతో ఫోటో దిగలేదు. అలా వారిచేత నేను అవమానపడ్డాను అంటూ కూడా వెల్లడించారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జబర్దస్త్ ప్రోగ్రాం చూస్తూనే ఉంటాను అని రవి తెలిపారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది స్కిట్ లు కనుక బాగుంటే వారికి పర్ఫామెన్స్ బాగుందని మెసేజ్ చేస్తూ ఉంటాను అని తెలిపాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version