చైత‌న్య తో అపైర్‌ పై శోభిత ఘాటు రిప్లై?? మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ వీడియో..!!

-

స‌మంత ( samantha ruthprabhu ), నాగ చైత‌న్య చూడ ముచ్చ‌టైన జంట, ఏవో ప‌ర్స‌న‌ల్ కార‌ణాల‌తో వీరిద్ద‌రూ విడిపోయి దాదాపుగా సంవ‌త్స‌రం కావ‌స్తుంది. ఇప్ప‌టికీ నెట్టింట స‌మంత, చైతుల విడాకుల ప్ర‌స్తావ‌న వ‌స్తూనే ఉంది. హీరోయిన్ శోభిత దూళిపాళ (Sobita Dhulipala) వ‌ల్లే వీరిద్ద‌రూ విడిపోయారంటూ గాసిప్ చెక్క‌ర్లు కొడుతుంది. నాగ చైతన్య, తెలుగు అమ్మాయి శోభిత దూళ్లిపాళ మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందని గుస గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ రూమ‌ర్స్ ని కావాల‌నే సమంత పీఆర్ టీం చేస్తుందంటూ ఆరోపిస్తూ అక్కినేని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన సమంత కూడా ఘాటుగా స్పందించింది కూడా. ఒక అమ్మాయిపై రూమర్స్ వినిపిస్తే కచ్చితంగా నిజం కావాలి.. అదే ఒక అబ్బాయిపై రూమర్స్ వస్తే ఎవరో అమ్మాయి ఈ రూమర్స్ సృష్టించింది అంటారు. మీ పని మీరు చూసుకోండి.. మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి అంటూ సమంత తనపై వస్తున్న ఆరోపణలపై బదులిచ్చింది.

ఇక చైతు, శోభిత‌ల‌పై వ‌స్తున్న గాసిప్స్ పై అటు చైతు కానీ ఇటు శోభిత కానీ స్పందించ‌క‌పోవ‌డంతో ఈ రూమ‌ర్స్ మ‌రింత‌గా స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఈ రూమర్లకు చెక్ పెట్టేందుకు శోభిత రిప్లై ఇచ్చింది. అది అలా ఇలా కాదు కాస్త ఘాటుగానే.. శోభిత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో మిడిల్ ఫింగర్ చూపిస్తున్న వీడియో పోస్ట్ చేసిందంటూ వీడియోను షేర్‌ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరు శోభిత తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో ఎక్కడా ఈ వీడియో పోస్ట్‌ చేయలేదని, ఇది పాత వీడియో అయి ఉండవ‌చ్చంటూ కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి సామ్ చైతూ విడిపోయిన తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కానీ సమంత విషయంలో మాత్రం రోజూ ఎదో ఒక వార్త నడుస్తూనే ఉంది. రీసెంట్ గా ట్రోల్స్ పైన విసిగిపోయిన సామ్.. ‘మేము మూవ్ ఆన్ అయ్యాం.. మీ పని మీరు చూసుకోండి’ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది.. అయినా కూడా నెటిజన్లు మాత్రం సమంతను వదలడం లేదు.

ఇప్ప‌టికైనా త‌మ మ‌ధ్య ఎలాంటి ఎఫైరు లేదంటూ చైత‌న్య లేదా శోభిత అయిన రెస్పాండ్ అయితే గానీ ఈ రూమ‌ర్స్‌కి పులిస్టాప్ ప‌డ‌దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version