ద్రౌపది పట్ల వ్యతిరేకత లేదు…కానీ యశ్వంత్ సిన్హా గెలవాల్సిందే – కేటీఆర్‌

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విపక్షాలు ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హా కు మద్దతు తెలిపామని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. హైదరాబాద్ కు రావాలని యశ్వంత్ సిన్హాను కోరామని….భారత్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నియంత లా వ్యవహారిస్తోందని ఆగ్రహించారు.

ద్రౌపది ముర్ము పట్ల తమకు వ్యతిరేకత లేదు…కానీ యశ్వంత్ సిన్హా గెలవాల్సిందేనని వెల్లడించారు కేటీఆర్‌. ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని… యశ్వంత్ సిన్హా గెలవాలని కోరుతున్నామని చెప్పారు. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని.. బిజెపి బావ డారిద్రానికి నిదర్శనమని ఆగ్రహించారు.

మేం చేయాలనుకుంటే చాలా చేస్తామని.. కానీ మేము చేయబోమన్నారు. 8 ఏళ్లలో తెలంగాణ కు బిజెపి ఏం చేసిందని.. ఇప్పటికే గుజరాత్ లో కరెంట్ కష్టా లు అన్నారు. ద్రౌపది ముర్ము సొంత ఊర్లో కరెంట్ లేని పరిస్థితి అని.. పొలిటికల్ టూరిస్టులు వస్తారు.. పోతారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version