మస్ట్ రీడ్: సోషల్ మీడియా జనాలు చిన్నపిల్లలు కాదు హీరో!

-

కొంతమంది తమకంట్లో దూలాలు పెట్టుకుని, ఎదుటివాడి కంటిలోని నలుసు గురించి కామెంట్స్ చేస్తుంటారు. ఇది చాలా మందికి నిత్యకృత్యం కూడా! ఆ సంగతి అలా ఉంటే… “గురివిందగింజ తన కింద ఉన్న నలుపు గురించి ఎరుగదు కదా” అంటూ ఒక కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హీరో సిద్ధార్ద్ పై ట్రోల్ అవుతుంది!

హీరోయిన్ సమంత.. హీరో నాగ్ చైతన్య విడిపోయారు. ఇంతకాలం సోషల్ మీడియాలో సాగిన చర్చకు ముగింపు ఇచ్చారు. అధికారికంగా ప్రకటించేసారు. ఇదే టైమ్ లో “మోసగాళ్ల జీవితమింతే” అనే అర్థం వచ్చేలా సమంత మాజీ లవర్ సిద్దార్థ ఓ ట్వీట్ వేసారు! దీంతో ఎప్పుడో ముగిసిన అధ్యాయం మళ్లీ తెరపైకి వచ్చింది! సిద్ధార్థ్ కి ఆ అర్హత ఉందా? అనే ప్రశ్నలు లేవనెత్తింది!

సిద్దార్ధ-సమంతల వ్యవహారం దాదాపుగా అందరికీ తెలిసిందే! ఒకానొక సమయంలో ఇద్దరి పెళ్లి పక్కా అనుకున్నారు. సమంత కొన్నాళ్ల పాటు సిద్దార్థ ఇంట్లోనే వుండేదనే వార్తలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి. ఆ ఇద్దరు కలిసి శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజులు జరిపిన ఫొటోలు అప్పట్లో తెగ హడావిడి చేశాయి. అయితే.. తర్వాత వారిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నారు.

ఈ క్రమంలో సమంత సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిపోవడం.. అనంతరం, నాగచైతన్యతో సమంత వివాహం జరగడం జరిగిపోయాయి. అయితే ఈ విషయాలపై ఇంతకాలం మౌనంగా ఉన్న సిద్ధార్థ్ ఇప్పుడు సమంతను మోసగత్తే అనే స్థాయిలో కామెంట్లు ఎందుకు చేసినట్లు? అసలు ఆ అర్హత సిద్ధార్థ్ కి ఉందా?

అవును… సిద్ధార్థ్ కు కూడా ఒక గ‌తం ఉంది. ఆ గ‌తంలో ఒక వివాహం కూడా ఉంది! అంటే… సిద్ధార్థ్ ఒక స్త్రీని మోసం చేసి అనంతరం సమంతతో లవ్ ట్రాక్ నడిపినట్లా? విడిపోవ‌డ‌మే.. దోషం అనుకుంటే, విడిపోవడం మొసం అయితే… ఆ దోషం – ఆ మోసం సిద్ధార్థ్ కూడా ఇంకోరి విష‌యంలో అప్పటికే చేసిన‌ట్టే కదా. పైగా… స‌మంత‌తో విడిపోయిన అనంత‌రం కూడా.. బాలీవుడ్ లో సిద్ధార్థ్ ఒక ప్రేమాయ‌ణాన్ని న‌డిపిన క‌థ‌లు కథనాలు వ‌చ్చాయి. అది కూడా బ్రేక‌ప్ అయ్యింది.

ఇలా తనవెనుక ఇంత స్టోరీ పెట్టుకున్న సిద్దార్థ్… సమంత – చైతన్య విడాకులు తీసుకున్న వెంటనే… ఆ స్థాయిలో స్పందించడం ఎందుకు? ఫలితంగా.. సమంతను పరోక్షంగా తనను మోసం చేసిన మోసగత్తే అని చెప్పేక్రమంలో… తాను డబుల్ మోసగాడిని అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేసినట్లే కదా! సిద్దార్థ్ ఎంత నర్మ గర్భంగా ట్వీటు వేసినా… సోషల్ మీడియా జనాలు చిన్న పిల్లలు కాదు కదా!

Read more RELATED
Recommended to you

Exit mobile version