డ్రగ్స్ సరఫరా చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. అరెస్ట్..!!

-

డ్రగ్స్ సరఫరా చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సోమవారం పక్కా ప్లాన్‌తో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.35 లక్షల విలువైన డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

చౌటుప్పల్ పోలీసులు

సీఐ ఎన్.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్ట్ గోదావరికి చెందిన వట్టూరి సూర్యసంపత్ (23), రాజమండ్రికి చెందిన తీగల దీపక్ ఫణీంద్ర ఇద్దరు స్నేహితులు. కొంతకాలంగా వీరు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారు.

ఈ నెల 28వ తేదీన గోవాకు వెళ్లిన వీరు ఎండీఎంఏ 25 పిల్స్, ఎల్ఎస్‌డీ-2 పిల్స్ డ్రగ్స్ ను కొనుగోలు చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర దిగి లారీలో రాజమండ్రి బయలుదేరగా.. సోమవారం చౌటుప్పల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గరి నుంచి రూ.1.35 లక్షల విలువ డ్రగ్స్ ప్యాకెట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని రిమాండ్ తరలిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version