అందరి బాధలోనూ మార్పులు వచ్చేయి. అందరి భాషలోనూ మార్పులు వచ్చేయి. ఒకప్పుడు కన్నా ఇప్పుడు భాష అస్సలు బాలేదు అని అన్నామే అనుకోండి అటు టీడీపీ, ఇటు వైసీపీ కత్తులు పట్టుకుని యుద్ధానికి దిగిపోతాయి. ఆ విధంగా ఆ రెండు పార్టీల వ్యవహార శైలి ఉంది. ఇప్పుడు టీడీపీ భాష కూడా మారిపోయింది. అమ్మాయిలు కూడా రాయలేని భాషలో మాట్లాడుతున్నారు. ఇదే సందర్భంలో వైసీపీ సాయిరెడ్డి కౌంటర్లు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.
ఆంధ్రావనిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే అన్న ధీమాలో పార్టీలు ఉన్నాయి. ఆ విధంగా ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. కొన్ని సార్లు శ్రుతి మించి వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు తెచ్చుకుంటున్నాయి. వాటిని నిలువరించలేక తరువాత అవస్థలు పడుతున్నాయి. మాట జాగ్రత్త అన్నది అస్సలు పాటింపులో లేదు. అటు అధికార పార్టీ అయినా ఇటు విపక్షం అయినా తమకు సంబంధించిన వరకూ మాట్లాడితే చాలు. అలా కాకుండా హెచ్చు స్వరంతో తీవ్ర స్థాయి వ్యక్తిగత దూషణలు, తిట్లు, వాటి స్థాయి కూడా దాటిపోయి ఏవేవో రాయలేని భాషలో మాటలు ఇవన్నీ అన్నింటా ఉన్నాయి. మహానాడులో కూడా ఉన్నాయి.ఓ విధంగా మహానాడు నేపథ్యంలో టీడీపీ హుషారుగా ఉంది. మహానాడు అనుకున్న దాని కన్నా ఎక్కువ విజయం అందుకోవడంతో టీడీపీ ఇంకాస్త జోరుగా ఉంది. ఇదే సందర్భంలో వైసీపీపై వ్యాఖ్యలు చేస్తూ ఉంది. సెటైర్లు వేస్తూ ఉంది. రానున్న కాలంలో అధికారం తమదే అని చెబుతూ ఉంది. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి నమ్మకం వారిది. గెలుపు అన్నది ఒకరి ఇంటికి పరిమితం కాదు. కనుక ఈసారి ఏమయినా జరగొచ్చు. పరిణామాలు మార్చొచ్చు ఓటరు. ఈ లోగా అధికార, విపక్ష పార్టీలు మాటల యుద్ధం అయితే ఆపేలా లేవు. త్వరలో మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న సాయిరెడ్డి గొంతు పెంచారు. మహానాడు నేపథ్యంలో స్పందించారు. టీడీపీ అంటే 2024 లో తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేమన్న మనో వేదన ఈ మహానాడులో కనిపిస్తుందని అన్నారు.