ఇదేంటి చంద్రబాబుకి వాళ్ళే సపోర్ట్ చేయరా…?

-

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఆ పార్టీ అధిష్టానానికి ఎంతవరకు మద్దతు వస్తుంది ఏంటి అనేది చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆ పార్టీ నేతలు పార్టీ అధిష్టానానికి పెద్దగా సహకరించడం లేదు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీకి దూరంగా ఉన్నారు.

దీనిపై పార్టీ అధిష్టానం కొంతమంది వద్ద అసహనం వ్యక్తం చేసింది. అయినా సరే పార్టీ నేతల తీరులో ఏ మాత్రం కూడా మార్పు రాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా కొంతమంది నేతలు దూరం పాటిస్తున్నారు. తాజాగా ఆయన పై సిఐడి అధికారులు కేసు నమోదు చేయగా ఖండించడానికి కూడా చాలామంది నేతలు ముందుకు రాలేకపోతున్నారు.

దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ సీనియర్ నేతలు మీడియా సమావేశాల్లో అప్పుడప్పుడు మాట్లాడటమే కానీ ఇలాంటి సందర్భాల్లో బయటకు రావడం లేదు. దీనితో కార్యకర్తలలో కూడా పార్టీ అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తం అవుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లలేక పోతున్నది ఆ పార్టీ నాయకత్వం. దీంతో చంద్రబాబు నాయుడు పార్టీ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ టిడిపి శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version