అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ విశ్వరూపం ప్రదర్శించింది. భారత బ్యాట్స్‌మెన్ వచ్చినవారు వచ్చినట్లు బంతులను బౌండరీలకు తరలించడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 224 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కోహ్లి ఓపెనర్ గా వచ్చి విజృంభించాడు. ఈ క్రమంలో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లు బౌండరీలను చూస్తూ నిలుచున్నారు తప్ప ఏమీ చేయలేకపోయారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్‌లు ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశారు. కోహ్లి 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా రోహిత్ శర్మ 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు.
అలాగే పాండ్యా 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్ చెరొక వికెట్ తీశారు.