నా ఆరోగ్యంపై కొంతమంది ఎంతో క్రియేటివ్ గా ప్రచారం చేశారు – హీరో విక్రమ్ వ్యంగ్యాస్త్రాలు

-

ఇటీవల దక్షిణాది స్టార్ హీరో విక్రమ్(56)కు గుండెపోటు అంటూ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీనిపై అప్పుడే విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్ ఖండించారు. విక్రమ్ కి గుండెపోటు రాలేదని, ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. అయితే ఈ విషయంపై విక్రమ్ కూడా స్పందించారు. తన కొత్త చిత్రం ‘కోబ్రా’ ఆడియో ఫంక్షన్ లో విక్రమ్ మాట్లాడుతూ ప్రస్తుతం తాను బాగానే ఉన్నాను అని వెల్లడించారు.

అభిమానులు తన వెంట ఉన్నంతకాలం తనకు ఏమీ కాదని విక్రమ్ వ్యాఖ్యానించారు. తను ఆసుపత్రిలో చేరింది గుండెపోటుతో కాదని స్పష్టం చేశారు. చాతిలో ఇబ్బందికరంగా అనిపించడంతో చికిత్స పొందానని.. కానీ మీడియాలోని కొన్ని వర్గాలు ఊహాగానాలు ప్రచారం చేశారని ఆరోపించారు. సోషల్ మీడియాలోనూ కొంతమంది ఎంతో క్రియేటివ్ గా తన ఆరోగ్యంపై ప్రచారం చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఉండగా నాకేం భయం అంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version