మహాశివరాత్రి స్పెషల్.. ఏడాదికోసారి తెరిచే 1000 ఏళ్ల శివాలయం

-

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులంతా శైవక్షేత్రాలకు బారులు తీరారు. ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. మరోవైపు శివరాత్రి పర్వదినాన మాత్రమే తెరుచుకునే కొన్ని ఆలయాలున్నాయి. ఏడాదికోసారి మాత్రమే తెరుచుకునే ఈ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అలాంటి ఓ కోవెల మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్​కు 48 కిలోమీటర్ల దూరాన కొలువైంది.

రాయ్‌సెన్‌ జిల్లాలో ఉన్న సోమేశ్వరాలయం శనివారం తెరుచుకోనుంది. ఏడాది పొడవునా మూసి ఉంచే ఈ ఆలయాన్ని మహా శివరాత్రి రోజున మాత్రమే తెరవడం ప్రత్యేకత. వెయ్యి అడుగుల ఎత్తయిన కొండపై ఉన్న ఈ శివాలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించగా.. పలువురు ముస్లిం రాజులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆలయాన్ని సామాన్య ప్రజల కోసం తెరవాలంటూ 1974లో ఉద్యమం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్‌ సేథీ సోమేశ్వరాలయం తాళం తీసి.. శివరాత్రి రోజున మాత్రమే పూజలు నిర్వహించేందుకు అనుమతించారు.

ప్రస్తుతం పురావస్తుశాఖ నిర్వహణలో ఉన్న ఈ ఆలయాన్ని మహా శివరాత్రి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటలపాటు తెరుస్తారు. శనివారం నాటి పర్వదినానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అధికసంఖ్యలో భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు. అయిదు క్వింటాళ్ల కిచిడీ, పండ్లను భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version