ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫ్యామిలీ పార్టీలకు బిజెపి వ్యతిరేకమని.. ఫ్యామిలీ పార్టీలతో కలిసి వెళ్ళతామని పేర్కొన్నారు. జనసేనతో కలిసి వెళ్ళతామని.. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడే ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. చంద్రబాబుపై నా వైఖరి మారలేదని… ఫ్యామిలీ పార్టీలకు దూరమని మా అధిష్ఠానమే చెప్పిందన్నారు.
ఏపీ పోలీసులు ప్రభుత్వానికి తాబేదార్లా?.. బీజేపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు..పోలీసు వ్యవస్థ ఎందుకు దిగజారిపోతోందన్నారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.. అవినీతి పెరిగిపోతోంది….మట్టి దోచేస్తున్నారు.. గ్రావెల్ దోచేస్తున్నారు.. రైతు భరోసా కేంద్రాల పేరుతో రవాణా ఖర్చుల కింద కోట్లు కొట్టేశారని సోము వీర్రాజు వెల్లడించారు. ఏపీలో వచ్చేది బీజేపీ సర్కారేనని పేర్కొన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.