“క్రమశిక్షణ” పేరుచెప్పి “ప్రక్షాళన” చేసుకుపోతున్న వీర్రాజు!

-

ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయినప్పటినుంచీ వీర్రాజు తనదైన దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇది అధిష్టాణం ఇచ్చిన అధికారమా లేక తనకు తాను పార్టీ శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయమా తెలియదు కానీ… ఇంతకాలం ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి కారణమైన ప్రతీ సమస్యనీ తొలగించుకునే పనికి పూనుకున్నారు వీర్రాజు. ఇందుకు ఆయన పైకి చెప్పే మాట “క్రమశిక్షణ” అయినా… ఎంచుకున్న లక్ష్యం మాత్రం “ప్రక్షాళన” అని అంటున్నారు విశ్లేషకులు!

మంచా, చెడా అన్నది పాయింట్ కాదు ఇక్కడ… పార్టీ చెప్పినట్లు నదుచుకుంటున్నారా లేదా అన్నదే ప్రధానం అన్నది వీర్రాజు వైఖరిగా కనిపిస్తోంది. ఏ పార్టీ అయినా, ఏ వ్యవస్థ అయినా అభివృద్ధి చెందాలంటే ముందుగా నిలదొక్కుకోవాలి.. ఒక్క మాటమీద ముందుకు పోవాలి. ఇదే సిద్ధాంతాన్ని నమ్మిన వీర్రాజు… మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ వైఖరి – బీజేపీ వైఖరిపై స్పష్టత ఇస్తూ… అది మీరినవారిపై బెత్తం జులిపిస్తూ వెళ్తున్నారు!

ఇందులో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ, గవర్నర్ కు ఇచ్చిన లేఖ విషయంలో.. “అదే పార్టీ వైఖరి – అదే ప్రభుత్వ వైఖరి” అని చెప్పిన సుజనా సన్నిహితుడు లంకా దినకర్ కి షోకాజ్ నోటీసులు ఇచ్చి సైలంట్ చేసింది ఏపీ బీజేపీ! ఇదే క్రమంలో… ఇటీవల మూడు రాజధానులపై పార్టీ వైఖరికి భిన్నంగా ఒక పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవీ. రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో… పార్టీ విధానానికి వ్యక్తిరేఖంగా అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణ‌ను బీజేపీ సస్పెండ్ చేశారు వీర్రాజు!

“రాష్ట్ర రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి సంబందం లేదని పార్టీ అధికారికంగా తెలిపింది. కానీ పార్టీ అభిప్రాయానికి మీ ప్రకటనలు పూర్తిగా వ్యతిరేకం గా ఉంది. పార్టీ.. రైతుల పక్షాన నిలబడటం లేదనే మీ ఆరోపణ నిరాధారమైనది. పార్టీ ఇమేజ్ ‌ను దెబ్బతీసేలా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. అనేక వార్తాపత్రికలు, టీవీ ఛానెల్స్ మీ తప్పుడు ఆరోపణలకు విస్తృత ప్రచారం ఇచ్చాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం” అని వెలగపూడి గోపాలకృష్ణ సస్పెన్షన్ పై క్లారిటీ ఇచ్చారు వీర్రాజు!

దింతో… మిగిలినవారు కూడా ఎలా ఉండాలో, ఇకపై ఎలా నడుచుకోవాలో, క్రమశిక్షణగా ఎలా మెలగాలో అనే హెచ్చరికలు పంపే దిశగా ఈ లేఖ క్లారిటీ ఇచ్చినట్లయ్యిందని అంటున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Exit mobile version