దొంగ ఓట్ల వ‌ల్లే ఓటింగ్ శాతం పెరిగింది : సోము వీర్రాజు

-

బద్వేలు ఉప ఎన్నిక సీఎం, వైసీపీ పార్టీ మాట తప్పిదాలకు నిదర్శనమ‌ని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మాట మడమ తిప్పని పార్టీ బీజేపీ అని ఆయ‌న అన్నారు. నిన్న పోలింగ్ సరళి చూస్తే 55 శాతం మించకూడదని…దొంగ ఓట్లు వేసుకున్నారు కాబట్టే ఓటింగ్ శాతం పెరిగిందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ కి ఓటమి భయం పట్టుకుందని….కాబట్టే వైసీపీ ఎక్కువ శాతం ఇంచార్జ్ లను పెట్టుకున్నారన్నారు. మండల వారిగా ఇంచార్జ్ లుగా ఉన్న వైసీపీ నాయకులు ఎందుకు బిజెపి ఏజెంట్ లను బెదిరించారని సోము వీర్రాజు ప్ర‌శ్నించారు. తిరుపతి ఉప ఎన్నికను తలిపించారని….బద్వేలు లో దొంగ ఓటర్లు బారులు తీరారన్నారు.

సిద్దవటం, కడప , ప్రొద్దుటూరు నుంచి స్ధానికేతారులను ప్రత్యేక వాహనాల్లో తరలించారని అన్నారు. నిన్న బద్వేలు ఉప ఎన్నికలో అడుగడుగునా దౌర్జన్యాలు చేశారని చెప్పారు. అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించారని…బద్వేలు లో 28 చోట్ల లో రిపోలింగ్ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీ లాగా దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం బీజేపీ కి లేదని సోము వీర్రాజు అన్నారు. దొంగ ఓట్లు వేయించుకునే వాళ్ళు బీజేపీ పార్టీ ని మాట్లాడే నైతిక హక్కులేదని ఆయ‌న మండి ప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version