సోము వీర్రాజు ఆందోళనలు నీరుగారిపోయినట్టేనా..?

-

రాష్ట్ర బీజేపీ సారథిగా సోము వీర్రాజు వచ్చిన తర్వాత వివిధ అంశాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వరుస ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంపై బీజేపీది పోరాట వైఖరే అనే మూడ్‌ తీసుకొచ్చారు. కానీ.. ఇప్పుడదంతా బూడిదలో పోసిన పన్నీరన్నట్టుగా మారిపోయిందట.

వైసీపీ ఎన్డీయేలో చేరినా.. చేరకున్నా.. కేంద్రానికి వైసీపీ దగ్గర అనే మెసేజ్‌ జనంలోకి వెళ్లిపోయిందని రాష్ట్ర బీజేపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారట. దీంతో ఈ ప్రభావం రాష్ట్రంలో కేడర్‌పైనా ఉంటుందని అనుకుంటున్నారు. అదీకాకుండా బీజేపీ అధిష్ఠానం దగ్గర వైసీపీకి ప్రాధాన్యం ఉందనే అభిప్రాయం అందరికీ అర్ధమైపోయిందని చెబుతున్నారట. ఇలాంటి స్ట్రోక్‌లతో తమ దూకుడుకు బ్రేక్‌లు పడటం ఖాయమని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. వైసీసీ మైండ్‌ గేమ్‌లో ఇరుక్కుపోయామని ముఖ్య నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పర్యటించిన కేంద్రమంత్రులు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పోగడ్తలతో ముంచెత్తేవారు. తెలంగాణ బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై పోరాటం చేస్తుంటే.. కేంద్రమంత్రులు చేసే ప్రకటనలతో జావ గారిపోయేవారు. నాడు తెలంగాణలో ఏం జరిగిందో.. ఇప్పుడు ఏపీలోనూ అదే సీన్‌ పునరావృతం అవుతుందేమోనని కలవరపడుతున్నారట కమలనాథులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version