దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఊహించ‌ని ట్విస్ట్‌… కాంగ్రెస్ మైండ్ బ్లాక్ అయ్యేలా…!

-

తెలంగాణ‌లోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ ముందుగా టీఆర్ఎస్‌కు ఝుల‌క్ ఇస్తే ఇప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన షాక్‌తో కాంగ్రెస్‌కు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక్క‌డ టీఆర్ఎస్ సీటు ఆశించి భంగ‌ప‌డ్డ మాజీ మంత్రి చెర‌కు ముత్యంరెడ్డి త‌న‌యుడు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ త‌మ పార్టీలో చేర్చుకుని సీటు ఇచ్చింది. దీంతో షాక్ అయిన టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌కు డ‌బుల్ షాక్ ఇచ్చింది.

ఈ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేర్లను ఆయా పార్టీలు ప్రకటించడంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. త‌మ పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ చేర్చుకోవ‌డంతో అలెర్ట్ అయిన మంత్రి హ‌రీష్‌రావు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగ‌ప‌డ్డ ఇద్ద‌రు కీల‌క నేతలు అయిన న‌ర్సింహారెడ్డి, మ‌నోహ‌ర్‌రావు ఇద్ద‌రిని త‌మ పార్టీలో చేర్చుకున్నారు.

నియోజ‌వ‌ర్గంలో బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉన్న ఈ ఇద్ద‌రు నేత‌లు ఈ రోజు మంత్రి హ‌రీష్ స‌మ‌క్షంలో గులాబీ కండువాలు క‌ప్పుకున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌ల అనుచ‌రులు కూడా పార్టీ మారిపోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో హ‌స్తం పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే. మ‌రోవైపు దుబ్బాక బీజేపీ సీటును వ‌రుస‌గా రెండోసారి కూడా ర‌ఘునంద‌న్ రావుకే కేటాయించ‌డంతో ఆ పార్టీలో కూడా అస‌మ్మ‌తి జ్వాల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. క‌మ‌లాక‌ర్ రెడ్డి ర‌ఘునంద‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో బీజేపీ ఆయ‌న్ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది.

రేపో మాపో ఆయ‌న కూడా గులాబీ గూటికే చేరిపోతారంటున్నారు. ఇక దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక న‌వంబ‌ర్ 3న జ‌రుగుతుండ‌గా.. అదే నెల 10న కౌంటింగ్ జ‌రుగుతుంది. ఏదేమైనా మంత్రి హ‌రీష్‌రావు మంత్రాగంతో దుబ్బాక‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు చాలా స్పీడ్‌గా మారిపోతున్నాయి.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version