భార్యతో గొడవ కారణంగా మధ్యలోకి వచ్చినందుకు తల్లిని హతమార్చాడో తనయుడు. ఈ ఘటన రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం కొత్త తండాలో శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికుల కథనం ప్రకారం.. నిన్న రాత్రి భార్యతో గొడవపడి వచ్చిన కొడుకు శ్రీనును తల్లి మందలించినట్లు తెలిసింది. దీంతో తననే తిడుతావా అని కోపంతో రగిలిపోయిన కొడుకు.. తల్లి తలపై కర్రతో బలంగా కొట్టినట్లు సమాచారం.తీవ్రగాయం కారణంగా బాధిత మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ మేరకు విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.