ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య-2 మూవీ రీరిలీజ్ అయ్యింది. దీంతో సంధ్య థియేటర్ వద్ద మరోసారి హంగామా నెలకొంది. బన్నీఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకుంటున్నారు.అయితే, పుష్ప 2 ప్రీమియర్..తరువాత జరిగిన తొక్కిసలాట దుర్గటన సందర్భంగా గతంలో ఉన్న హంగామా, సందడి మిస్ అవుతోంది.
ఆర్య- 2 రీ రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్‌కు బన్నీ అభిమానులు వస్తున్నా.. సందడి మాత్రం కరువైంది. పోలీసుల భద్రత నడుమ థియేటర్‌లో షోలు వేస్తున్నట్లు తెలిసింది. మరోసారి బన్నీ సినిమా వచ్చిందని తెలిసి పోలీసులు భారీగానే అక్కడకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు.