అమ్మాయిగా మారిన ఎలాన్ మస్క్ కొడుకు.. పేరు కూడా మార్చుకోవాలని!

-

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కుమారుడు అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన పేరును కూడా అమ్మాయిలా మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే లింగ మార్పిడి చేసుకున్న అతను.. తాజాగా తన పేరును కూడా మార్చుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అలాగే తన తండ్రితో ఉన్న సంబంధాన్ని కూడా తెంచుకోనున్నట్లు తెలుస్తోంది. వివియన్ జెన్నా విల్సన్ పేరుతోపాటు లింగత్వం మార్పుతో కొత్తగా జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

ఎలాన్ మస్క్

2008లో ఎలాన్ మస్క్ మాజీ భార్య జస్టిస్ విల్సన్‌తో విడాకులు తీసుకున్నారు. వీరికి జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్ అనే ఇద్దరు కుమారులున్నారు. అందులో జేవియర్ అలెగ్జాండర్ కొంతకాలం కిందట అమ్మాయిగా లింగమార్పిడి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు నిండాయి. దీంతో తన పేరును కూడా మార్చుకుని కొత్త జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని అమెరికా శాంటా మోనికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్‌లో ఈ పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version