భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలను బీజేపీ పార్టీ క్రూరంగా అణచివేస్తుందని.., గాంధీజీ హంతకులను ఆరాధిస్తున్నారని నిప్పులు చెరిగారు సోనియా గాంధీ. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని ఓ రేంజ్ లో బీజేపీ పార్టీపై ఫైర్ అయ్యారు సోనియా గాంధీ.
భారత దేశ ప్రజల్ని బీజేపీ భయాందోళనకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అని చెప్పారు.. దీని అర్థం దేశాన్ని నిట్టనిలువునా చీల్చడమన్నారు సోనియా గాంధీ. దేశంలో ఎన్నడూ లేనటు వంటి అరాచక పాలనను మోడీ సర్కార్ కొనసాగిస్తోందని నిప్పులు చెరిగారు. ఇప్పటి కైనా ప్రజలు గ్రహించి.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ సర్కార్ కు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కచ్చితంగా కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని కోరారు.