సోనూసూద్ డిమాండ్.. నీట్‌, జేఈఈ పరీక్షలు వాయిదా వేయండి..!

-

సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న జేఈఈ, నీట్‌ పరీక్షలను వాయిదా వేయాల‌ని సోనూ సూద్ డిమాండ్ చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో విద్యార్థుల‌ను ప‌రీక్ష‌లు రాయాల‌ని బ‌ల‌వంతం చేయ‌కూడ‌ద‌ని, ఈ పరీక్షలు మ‌రో 2 నెల‌లు వాయిదా వేయాల‌ని ఆయన కోరారు. వారు మాన‌సికంగా సిద్ధ‌మైన‌ప్పుడే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌న్నారు. ఈ పరీక్షలు రాసే చాలా మంది పిల్లలు వ‌ర‌దల‌తో తీవ్రంగా ప్ర‌భావిత‌మైన ప్రాంతాలలో ఉన్నారన్నారు. ఈ టైంలో వారిని పరీక్షలు రాయమనడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు.

అయితే సోనూసూద్ చేసిన ఈ డిమాండ్ పై అనేకమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మద్దతు పలుకుతున్నారు. 26 లక్షల మంది విద్యార్థుల గొంతు సోనూసూద్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, జేఈఈ మెయిన్ సెప్టెంబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కు, నీట్ సెప్టెంబ‌ర్ 13న జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా ప్ర‌తిష్టాత్మక విద్యాసంస్థ‌లైన ఐఐటీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్‌ 27న జ‌ర‌గ‌నుంది.

అయితే కరోనా అనుమానితుల‌కు ఐసోలేష‌న్ గ‌దిలో ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలని ఆయనేకమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version