భారత యువ షూటర్ సౌరబ్ చౌదరి టోక్యో ఒలంపిక్స్ లో తన సత్తా చాటాడు. 10 మీటర్ల పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో… సౌరబ్ చౌదరి ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. మొత్తం 36 మంది షూటింగ్ లో పోటీపడగా… 586-28x తో మొదటి స్థానంలో నిలిచాడు.
అతడి అనుచరుడు అభిషేక్ శర్మ 575-19x తో 17 వ స్థానానికే పరిమితం అయ్యాడు. సౌరబ్ చౌదరి 6 సిరీస్ ల్లో వరుసగా… 95,98, 98, 100, 98, 97 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు. అయితే తే.గీ మధ్యాహ్నం అతడు పథకాన్ని సాధిస్తాడో లేదో చూడాలి. క్రికెట్ టేబుల్ టెన్నిస్ లో ఇండియా కు నిరాశే ఎదురైంది. ఇది ఇలా ఉండగా.. ఈ ఒలంపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించింది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో… రజత పతకం సాధించి రికార్డులను తిరగరాసింది. రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరా భాయ్ చరిత్ర సృష్టించింది.