నిలకడగా సౌరవ్ గంగూలీ ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

-

టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు కోల్ కతా లోని ఉడ్ ల్యాండ్ ఆసుపత్రి వెల్లడించిది. ఇటీవల మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో గంగూలీ కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్ ఆసుపత్రిలో చేరాడు. గంగూలీకి ఇప్పటికే మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ చికిత్సను వైద్యులు అందించారు. గంగూలీ ఆరోగ్యం హీమోడైనమిక్‌గా స్థిరంగా ఉందని.. గదిలో ఆక్సిజన్ శాచురేషన్ 99 శాతంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇటీవల చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇటీవల కాలంలో త్రుణమూల్ కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్, మహారాష్ట్ర ఎంపీ, ఎన్సీపీ నేత సుప్రియా సూలేతో పాటు ఆమె భర్త కరోనా బారిన పడ్డారు. తెలంగాణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు కరోనా బారిన పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version