చలికాలంలో పాదాలు ఊరికే పగిలిపోతుంటాయి. ఇంట్లో ఉన్నాసరే..ఈ పగుళ్లు రావటం కామన్. పెదాలు, చేతులు పొడిబారుతాయి. కాళ్లు పగిలితే విపరీతమైన నొప్పితో పాటు..చూసేందుకు కూడా ఏమాత్రం బాగుండదు. కొన్ని హోం రెమిడీస్ తో వీటిని నివారించవచ్చు.
యాపిల్ సైడర్ వెనిగర్: గోరువెచ్చని నీటిలో..ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. అప్పుడు మీ పాదాలను ఆ నీటిలో సుమారు 15 నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత బ్రష్‌తో బాగా స్క్రబ్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ పాదాలు మృదువుగా మారుతాయి. కాళ్ల పగుళ్లు త్వరగా మాయం అవుతాయి.
కలబంద: 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ ను ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ మిక్స్ చేసి పాదాలకు బాగా మసాజ్ చేయండి.
హెన్నా: గోరింటాకు ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి కాళ్ల పగుళ్లపై రాసి కాసేపు ఆరనివ్వాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల పగుళ్లు పూర్తిగా నయమవుతాయి.
తేనె: 100 గ్రాముల ఉప్పును తీసుకుని అందులో కొన్ని చుక్కల తేనె కలిపి…ఈ ద్రావణాన్ని తీసుకుని పాదాలకు బాగా మసాజ్ చేయండి. ఇది మృతకణాలను తొలగించి పొడి చర్మాన్ని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాగే చేస్తూ ఉంటే పగుళ్లు తగ్గిపోతాయి.
లాంతర్న్ నూనె: లాంతరు నూనె, కొబ్బరి నూనె సమపాళ్లలో తీసుకోని…అందులో కొద్దిగా పసుపు పొడిని మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకోండి. ఆ మిశ్రమాన్ని పాదాల పగుళ్లపై అప్లై చేసి కాసేపటి తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల పగుళ్లు పూర్తిగా నయమవుతాయి.
ఇంకెందుకు ఆలస్యం… ఈ హోమ్ రెమిడీస్ తో మీ పాదాలను అందంగా మార్చేసుకోండి