ఆస్ట్రేలియా టూర్‌లో టీమ్ ఇండియా విజయాలు కోహ్లీ కెప్టెన్సీపైనే ఆధారపడి ఉంటాయన్నారు బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ. ఆస్ట్రేలియాలో ఓపెనింగ్ భాగస్వామ్యం ఎంతో కీలకమని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాలోనే కాదు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లో మొదటి 20 ఓవర్లు చాలా ముఖ్యమని అన్నారు. గతం ఆస్ట్రేలియా టూర్‌లో 2-1 తేడాతో భారతో భారత్ చారిత్రక టెస్టు విజయం సాధించింది. అయితే, అప్పుడు వార్నర్, స్టీవ్‌స్మిత్ లేరు. ప్రస్తుతం ఆ ఇద్దరికి తోడు మార్నస్ లబుషేన్ సైతం ఆ జట్టులో కొనసాగుతున్నాడు.
దీంతో భారత్ రాణించడం అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దీంతో టీమిండియా విజయాలు విరాట్ నాయకత్వంపైనే ఆధారపడ్డాయని అభిప్రాయపడ్డారు గంగూలీ. బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోవాలని, ఎవరిని ఎప్పుడు ఎలా ఆడించాలో కోహ్లీయే చూసుకోవాలన్నారు గంగూలీ. భారత పేస్ దళం ఈసారి అత్యంత నాణ్యంగా కనిపిస్తోంది. నవదీప్ సైనీ గతేడాది కంటే ఈసారి ఊహించనంతగా మెరుగయ్యాడు. మంచి పేస్, మంచి లెంగ్త్ తో బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. టీమిండియా పేస్ విభాగం ఎంతో బలంగా ఉంది. ఈ విషయం నేను బీసీసీఐ అధ్యక్షుడిగా చెప్పడంలేదు, ఓ ఆటగాడిగా చెబుతున్నా అన్నారు గంగూలీ.