వరల్డ్ కప్ టీం ను ప్రకటించిన మాజీ బీసీసీఐ చీఫ్ !

-

ఈ సంవత్సరం జరగనున్న మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాలో జరగనున్న విషయం తెలిసిందే. అందుకే అభిమానులు ఈ మ్యాచ్ ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో ఆడనున్న ఇండియా జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అందరి మెదడులో కేవలం సమీకరణాలు ఉన్నాయి. మరి వరల్డ్ కప్ ఆడనున్న ఆ 15 మంది సభ్యులు ఎవరన్నది ఇంకా తెలియడానికి సమయం పట్టేలా ఉంది. అయితే తాజాగా మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వరల్డ్ కప్ లో వీరు ఉంటే ఇండియా కప్ ను అందుకుంటుంది అని బలంగా నమ్ముతున్నాడు.

ఇక ఈయన ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ, గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కే ఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, షమీ , సిరాజ్ మరియు శార్దూల ఠాకూర్ లు ఉన్నారు. ఇంకా అభిమానులు ఆసిస్తూ జట్టులో చోటు దక్కని వారిలో సంజు శాంసన్ మరియు చాహల్ లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version