విజయ్ దేవరకొండ మరియు సమంతలు జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి.. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. డైరెక్టర్ శివ నిర్వాణ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని అందించడానికి కృషి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన సాంగ్స్ మరియు పోస్టర్ లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒకవైపు సమంత మరియు విజయ దేవరకొండలు పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో సమంత విజయ్ గురించి మాట్లాడుతూ , ఇండస్ట్రీ లో విజయ్ ను అందరూ రౌడీ రెబల్ అంటూ అంటున్నారు.. కానీ మీరనుకుంటున్నట్లు ఇతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని సర్టిఫికెట్ ఇచ్చిందట. రోజూ తన పని చేసుకుంటూ ఎంతో క్రమశిక్షణతో ఉంటాడని ప్రశంసలు గుప్పించింది సమంత.
విజయ్ దేవరకొండకు అద్దిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చిన సమంత … !
-