ఐసీయూలో పెళ్ళి రోజు జరుపుకున్న బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం..!

-

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనాతో చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రిలో కొంతకాలంగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త‌న 51వ వివాహ వార్షికోత్స‌వాన్ని శ్రీమ‌తితో క‌లిసి శనివారం సాయంత్రం ఆసుప‌త్రిలోనే చేసుకున్నాడ‌ని తమిళ మీడియా వెల్లడించింది. ఈ మేర‌కు ఎస్పీ బాలు స‌తీమ‌ణి సావిత్రి ఆసుప‌త్రికి వెళ్లార‌ని, అక్కడే డాక్ట‌ర్లు, ఐసీయూ సిబ్బంది మధ్య దంప‌తులు కేక్ క‌ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

దీంతో సోష‌ల్ మీడియాలో ప‌లువురు పోస్టులు పెడుతున్నారు. ఏ పోస్టులు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే దీనిని ఆసుప‌త్రి వ‌ర్గాలు కానీ, బాలు కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్ కానీ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇక బాలు పరిపూర్ణ ఆరోగ్యాంతో డిశ్చార్జ్ కాబోతున్న తరుణంలో ఓ పాట‌ని ఆల‌పించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version